పానసోనిక్‌ నుంచి వైరా సీఎస్‌580 ఎల్‌ఈడీ టీవీ

Panasonic Launched Viera CS580 LED Tv

04:32 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Panasonic Launched Viera CS580 LED Tv

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ పానసోనిక్‌ సరికొత్త ఫీచర్లతో ఎల్ఈడీ టీవీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. వైరా టీహెచ్‌-49సీఎస్‌580డీ పేరుతో ఈ ఎల్‌ఈడీ టీవీని అందుబాటులోకి తెచ్చింది. 49 అంగుళాల ఈ ఎల్‌ఈడీ టీవీ ధర రూ.84,900. హెక్సా క్రోమ డ్రైవ్‌ టెక్నాలజీతో ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. ఈ టీవీకి వైర్‌లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్స్‌ అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే టీవీకి 3 హెచ్‌డీఎంఐ, ఒక యూఎస్‌బీ పోర్ట్సు ఉన్నాయి. ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌, ప్రింటర్లను కూడా టీవీ సపోర్ట్‌ చేస్తుంది. ఈ టీవీని వినియోగదారులు వాయిస్‌ గైడెన్స్‌ ద్వారా, టీవీ రిమోట్‌ యాప్‌ ద్వారా, ఇంటర్నెట్‌ యాప్స్‌, వెబ్‌ బ్రౌజింగ్‌ ద్వారా ఆపరేట్‌ చేయవచ్చు.

English summary

Popular Electronics Company Panasonic has launched the Viera TH-49CS580D full-HD LED television in India. The price of that TV was Rs. 84,900