పానాసోనిక్ నుంచి టఫ్‌ప్యాడ్ స్మార్ట్‌ఫోన్లు

Panasonic Toughpad FZ-F1, FZ-N1 Rugged Smartphones

01:28 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Panasonic Toughpad FZ-F1, FZ-N1 Rugged Smartphones

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి సంస్థ పానాసోనిక్ రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎన్1, టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎఫ్1 పేరిట ఈ హ్యాండ్‌హెల్డ్ టైప్ స్మార్ట్‌ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. ఆండ్రాయిడ్ తో పనిచేసే టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎన్1 హ్యాండ్‌హెల్డ్ డివైస్ కమ్ స్మార్ట్‌ఫోన్ రూ.1.03 లక్షలు. విండోస్ 10 ఆధారిత టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎఫ్1 హ్యాండ్‌హెల్డ్ డివైస్ కమ్ స్మార్ట్‌ఫోన్ రూ.1.10 లక్షలకు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎన్1 ఫీచర్లు ఇవే..

4.7 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

టఫ్‌ప్యాడ్ ఎఫ్‌జడ్-ఎఫ్1 ఫీచర్లు ఇవే..

4.7 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, , 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

English summary

Panasonic company unveiled two new Toughpad handheld devices - the Toughpad FZ-F1 and FZ-N1 - at the Mobile World Congress in Barcelona.This smart phone comes with Windows a,d Android Versions.