ఆ గుడికెళితే మందు ముట్టరట తెలుసా?

Panduranga Swamy temple in Untakal

05:08 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Panduranga Swamy temple in Untakal

తెనాలి రామకృషుడు పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది చమత్కార కవి. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా, వికటకవి గా ఖ్యాతికెక్కిన ఇతడు పాండురంగ భక్తుడు. పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ చేయని వర్ణనలు, వాడని పదాలు ఉంటాయి. పాండురంగ మహాత్మ్యము చదివితే, దుర్వాసనాలకు గురైన వ్యక్తిని పాండురంగడు ఏవిధంగా తప్పించాడో మనకు బోధపడుతుంది.

అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఎక్కడంటే, అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో... ఇక్కడ కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మాన్పించే శక్తివంతమైన దేవుడు.

1/8 Pages

ఎలా చేరుకోవాలి?


ఈ ఊరు చేరుకోవాలంటే ముందుగా అనంతపురానికి వెళ్ళాలి. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో గల రాయదుర్గం వరకు బస్సులో చేరుకొని, అక్కడి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చేరుకోవాలి. రాయదుర్గంలో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్(ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు.

బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకళ్ దేవాలయానికి వెళ్ళవచ్చు. ఉంటకళ్ పాండురంగ స్వామి దేవాలయం ఉంతకల్లులో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు.

English summary

Panduranga Swamy temple in Untakal