ఇక్కడ స్నానం చేస్తే పాపం పోతుందట.. పైగా సర్టిఫికేట్ కూడా ఇస్తారట!

Papavimochana for only 11 rupees

10:40 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Papavimochana for only 11 rupees

చాలా మంది తాము చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు తీర్ధయాత్రలకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ పాపాలు పోతాయని గ్యారంటీ లేదు. అందుకే రాజస్థాన్లోని ఓ ఆలయంలోని కొలనులో స్నానం చేసి, 11 రూపాయలు దక్షిణ ఇస్తే చాలు.. పాపాల నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లు ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ప్రతాప్గఢ్ జిల్లాలో ఉన్న గోమఠేశ్వర్ మహాదేవ పాపమోచన్ తీర్థ అనే శివాలయంలో మాత్రం పాపవిముక్తి సర్టిఫికేట్ కూడా ఇస్తారట. అది కూడా ఈ మధ్య వచ్చింది కాదు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అక్కడ గల మందాకినీ కుండంలో స్నానం చేసి, శివాలయంలో పూజలు చేసుకుని వస్తే వాళ్లకు పాపవిముక్తి సర్టిఫికేట్లు ఇస్తున్నారు.

సర్టిఫికేట్ ఖరీదు కేవలం ఒక్క రూపాయేనట. అయితే మిగిలిన 10 రూపాయలు దోషనివారణ కోసం అని చెబుతున్నారు. చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికొచ్చి, పాపముక్తి సర్టిఫికేట్లు తీసుకుని వెళ్తున్నట్లు ప్రధాన అర్చకుడు నందకిశోర్ శర్మ చెబుతున్నారు. ఈ ఆలయానికి గిరిజనుల హరిద్వార్గా గుర్తింపు ఉంది. కొన్ని శతాబ్ధాలుగా ఇక్కడకు భక్తుల రాకపోకలు బాగున్నాయని ముఖ్యంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తారని అంటున్నారు. ప్రధానంగా మే నెలలో నిర్వహించే గోమఠేశ్వర తీర్థానికి లక్షల్లో భక్తులు వస్తారని శర్మ తెలిపారు. ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య పెరిగినా, సర్టిఫికెట్లు తీసుకునేవాళ్లు మాత్రం తగ్గారట.

ఈసారి మేలో జరిగిన 8 రోజుల తీర్థంలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నా, కేవలం మూడు సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు చాలా రకాల కీటకాలు చనిపోతాయని, వాళ్లు పాపభీతితో బాధపడుతూ ఇక్కడికొచ్చి పాపవిముక్తి చేసుకుంటారని మరో పూజారి కన్హయ్యలాల్ శర్మ తెలిపారు. మొత్తానికి బాగుంది కదండీ ఈ ఆచారం. మీరు కుడా ఏమైనా పాపాలు చేస్తే ఇక్కడికి వెళ్లి పాపవిముక్తి చేసుకోండి.

English summary

Papavimochana for only 11 rupees