ఏడాది నుంచి వెతుకుతున్నా ....

Paraneeti Chopra New Film Meri Pyaari Bindu

10:16 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Paraneeti Chopra New Film Meri Pyaari Bindu

అవును, ఈ ముద్దు గుమ్మ వెతుకులాట కు ఫలితం లభించింది. 2014 నవంబరులో వచ్చిన ‘కిల్‌ దిల్‌’ తర్వాత పరిణీతి చోప్రా కు ఇంకో సినిమా చేయలేదు. మొత్తానికి పరిణీతి తన కొత్త సినిమా సంగతి అందంగా ట్వీట్‌ చేసింది. ‘మేరీ ప్యారీ బిందు’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది.

నిజానికి చాలామంది నటీ నటులు 'మనసుకు నచ్చిన కథ కోసం ఎన్నాళ్లైనా ఆగుతాం... అలాంటి కథతోనే సినిమా చేస్తాం' అంటుంటారు మరి అలాంటి సినిమా ప్రకటించేటప్పుడు ఆ సంతోషం ఎలా వుంటుందో చెప్పాలంటే, పరిణీతి చోప్రా సంబరంలా ఉంటుంది. ‘‘సంవత్సరం నుంచి వెతుకుతున్న మంచి కథ దొరికింది’’ అంటూ తన ఆనందం పంచుకుంటూ ట్వీట్‌ చేసింది. యశ్‌రాజ్‌ సంస్థలో మనీష్‌ శర్మ నిర్మిస్తున్న ఈ సినిమా లో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్షయ్‌ రాయ్‌ తెరకెక్కిస్తాడు. ఈ సినిమా కోసం పరిణీతి ఓ పాట కూడా పాడుతోంది. అందుకు సంబంధించి వీడియో రూపంలో వినిపించింది. మొత్తానికి కొత్త సినిమా సంబరం ఎలా వుంటుందో ఈ భామ భలే చెప్పింది .

English summary