కొడుకుని హీరో చేసి, నష్టపోయిన కుటుంబం ఆత్మహత్య

Parents gets suicide for making their son as a hero

01:36 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Parents gets suicide for making their son as a hero

ఇదో విషాద గాధ. తానొకటి తలస్తే, దైవం ఒకటి తలచిందన్నచందంగా ఆ కుటుంబ పరిస్థితి తయ్యారయింది. ఇంతకీ విషయం ఏమంటే, కుమారుడ్ని హీరోగా పెట్టి తీసిన సినిమా వల్ల కలిగిన నష్టాల వలన తమిళనాడులో డీఎంకే నాయకుడి కుటుంబం ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈవిషయం తెలిసింది. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో వున్న పురంగరై గ్రామానికి చెందిన డీఎంకే నాయకుడు పొన.కుమార్(45) గత 16వ తేదీ రాత్రి తన భార్య సుమతి, కుమారుడు దీన, కుమార్తె షణ్ముగప్రియలతో కలిసి విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.

దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో పొనకుమార్ నిర్మించిన కాదల్ జననం అనే చిత్రంలో ఆయన కుమారుడు దీన హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో కలిగిన భారీగా నష్టంతో మనస్థాపం చెందిన తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

English summary

Parents gets suicide for making their son as a hero