కన్న కూతురికి విషమిచ్చి చంపేశారు

Parents killed their daughter by giving poison

11:35 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Parents killed their daughter by giving poison

అవునా, ఇంత దారుణం అయిన ఘటన ఎక్కడైనా ఉంటుందా, అంత కర్కశంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఉంటారా? అనిపించడం సహజం. అయితే ఈ సంఘటన నిజమనే నిరూపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో తల్లిదండ్రులే 22 ఏళ్ల తమ కూతురుకు విషమిచ్చి హత్య చేశారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన యువతి తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కధనం ప్రకారం గురుమల్లప్ప(64), మంజుల(48)లకు మధు కుమారి(22), గురుప్రసాద్ అనే ఇద్దరు సంతానం.

అయితే శివరాజు అనే వ్యక్తితో మధు కుమారికి ఆమె కుటుంబసభ్యులు ఏప్రిల్ 29న వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి మధు కుమారికి ఇష్టం లేదు. అదే విషయాన్ని తల్లిదండ్రులు, సోదరుడికి ఆమె తేల్చి చెప్పింది దీంతో విషయం కూపీ లాగితే, గురుప్రసాద్ స్నేహితుడైన జయరాం అనే యువకుడితో మధు కుమారి ప్రేమాయణం సాగిస్తోందనే విషయం ఆమె కుటుంసభ్యులకు తెలిసిపోయింది. అదే గ్రామానికి చెందిన జయరాంది వేరే కులం కావడంతో మధు కుమారి కుటుంబసభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అతన్నే వివాహమాడతానని తెగేసి చెప్పడంతో, ఇక లాభం లేదని భావించిన కుటుంబసభ్యులు పైకి నవ్వు నటిస్తూ, ప్రేమ ఒలకబోస్తూ, నీ ఇష్టం అంటూనే మధు కుమారితో పురుగుల మందు కలిపిన మామిడి రసాన్ని తాగించారు.

దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మామూలు మరణంలా చిత్రించే ప్రయత్నం చేసారు. అయితే మధు కుమారి అంతకంటే ముందే.. తనకు వేరే వివాహం చేస్తున్నారని తన ప్రియుడు జయరాంకు లేఖ రాసింది. ఈ పెళ్లికి అంగీకరించకపోతే తనను గానీ, జయరాంను గానీ చంపుతామని కుటుంబసభ్యులు బెధిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆ లేఖలో పేర్కొంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధు కుమారిని హత్య చేసిన ఆమె తల్లిదండ్రులు, సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో బుకాయించినా ఆ తరువాత తమదైన శైలిలో పోలీసులు విచారణ చేసే సరికి తమ నేరాన్ని నింధితులు అంగీకరించక తప్పలేదు.

ప్రేమించిన వాడు వేరే కులం వ్యక్తి కావడంతోనే పరువు కోసం కన్న కూతుర్ని చంపుకున్నారని పోలీసులు వివరించారు.

English summary

Parents killed their daughter by giving poison. Parents killed their daughter beacuse she loved another caste boy.