పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుందని.. తల్లిదండ్రులు ఏం చేసారో చూడండి..

Parents killed their daughter for about her pregnancy

04:17 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Parents killed their daughter for about her pregnancy

ఇది నిజంగా ప్రతీ తల్లిదండ్రులు తల దించుకోవాల్సిన సంఘటన. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుందని కుటుంబసభ్యులు ఆగ్రహాంతో కూతురుని చంపి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కడ్తల్ మండలం మైసిగండి గ్రామపంచాయతీ పరిధిలోని మొగులురాళ్ల తండాలో ఇస్లావత్ దేవ్లా, సోని దంపతుల కుమార్తె మంజుల(19) కొంత కాలంగా నల్గొండ జిల్లా దేవరకొండలోని బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈ మధ్యే ఇంటికి వచ్చింది. అయితే కూతురు ప్రవర్తనలో తేడా రావడంతో అనుమానించిన తల్లిదండ్రులు నిలదీశారు. మంజుల గర్భం దాల్చిందని తల్లిదండ్రులు, మంజుల సోదరులు తెలుసుకున్నారు.

పెళ్లి కాకుండానే గర్భం రావడానికి కారకుడెవరు అని మంజులను ఎంత ప్రశ్నించినా ఆమె చెప్పలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కుటుంబసభ్యులు మంజులను తీవ్రంగా కొట్టడంతో.. ఆ దెబ్బలకు మంజుల మృతి చెందింది. మృతి చెందిన మంజుల నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని స్థానికులను నమ్మించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే కుటుంబ సభ్యులే మంజులను చంపారని బయటకు పొక్కడంతో రెవెన్యూ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు.

English summary

Parents killed their daughter for about her pregnancy