చిన్నారిని కారులో వదిలేసి.. డోర్ లాక్ చేసి ... ఆ జంటఏం చేసారో తెలుసా

Parents Locked Their Child Inside The Car

10:44 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Parents Locked Their Child Inside The Car

తమ పనిలో పడి, పిల్లల్ని మరిచిపోతే, అజాగ్రత్తగా వ్యవహరిస్తే, నిర్లిప్తంగా ఉంటే, ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విషయం తెల్సి కూడా కొందరు అలానే చేస్తారు. సరిగ్గా శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఇలాంటి ఘటనే జరిగింది. రెండేళ్ల చిన్నారి కారులో కొన్ని నిమిషాలపాటు ఉక్కిరిబిక్కిరయ్యింది. పాపకు ఏదో ఆపద పొంచివుందని భావించిన స్థానికులు, అద్దాలను పగలగొట్టి కాపాడారు. అసలేం జరిగింది? ఇంతకీ పాప పేరెంట్స్ ఎక్కడ? అనే విషయాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ జంట, తమ రెండేళ్ల పాపతో కలిసి బెంగుళూరుకి కారులో వెళ్తున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో కారు ఆపి టిఫిన్ చేయడానికి వెళ్లారు. ఆ టైమ్ లో చిన్నారి నిద్రపోవడంతో కారులో వుంచారు. కారు అద్దాలు మొత్తం అంతా క్లోజ్ చేసారు. వాళ్ళు అలా వెళ్ళాక, చిన్నారికి మెలకువ వచ్చేసింది. దీంతో లోపల ఊపిరి ఆడక బయటకు వచ్చేందుకు ఆ పాప ప్రయత్నించింది. అయితే డోర్ లాక్ వలన ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు అద్దాలను పగలగొట్టి బయటకు తీశారు. అప్పటికే పాప స్పృహ కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ వచ్చి పాపను స్థానిక ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయించారు. అయితే పాపకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకోవడం పేరెంట్స్ వంతైంది.

ఇది కూడా చూడండి: నాన్ వెజ్ తిని గుడికి వెళ్ళొచ్చా?

ఇది కూడా చూడండి: రాత్రి ఏ దిక్కుకి తల పెట్టుకుని పడుకుంటే మంచిదో తెలుసా?

English summary

Hyderabad Parents Locked Their Child Inside The Car for went to breakfast.