ఏంటీ దారుణం కూతుళ్లతో వ్యభిచారం చేయిస్తున్న తల్లిదండ్రులు

Parents Sends Their Daughters To Prostitution

05:03 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Parents Sends Their Daughters To Prostitution

అసలు ఈ లోకంలో ఏం జరుగుతుంది రోజుకో దారుణం బయట పడుతుంది. మొన్న అన్నని పెళ్ళి చేసుకున్న చెల్లి, నిన్న సొంత భర్తే భార్యని నగ్నంగా ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో ఫోటోలు తీసి పెట్టాడు. ఇవి మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వస్తే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో నివాసముండే పద్మ-రమేష్‌లకు ఇద్దరు కుమార్తెలు. అయితే రమేష్‌ తన పిల్లలు చిన్నప్పుడే గుండెపోటుతో మరణించాడు. ఆ తరువాత పద్మ గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబందం పెట్టుకోవడమే కాకుండా మద్యానికి బానిసయింది. కొద్ది కాలం తరువాత పద్మ దురలవాట్లు వల్ల మతి స్థిమితం కోల్పోవడంతో పద్మ ఇద్దరి కుమార్తెలను గోవిందు తన భార్య లక్ష్మీ దత్తత తీసుకున్నారు.

ఆ ఇద్దరి ఆడ పిల్లలని పెద్ద అయ్యేంత వరకు బాగానే పెంచారు. అయితే ఆ తరువాత గోవిందు లక్ష్మీ డబ్బుకి ఆశపడి, పెంపుడు కూతుళ్లు అవ్వడంతో వాళ్లతో వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించాలని దురాచన పన్నారు. ఈ నేపధ్యంలోనే ఆ ఇద్దరి ఆడపిల్లలని వ్యభిచార రొచ్చులోకి నెట్టారు. రోజు వారిని వ్యభిచారంలోకి పంపి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ వేధింపులని తట్టు కోలేక పెద్ద కూతురు ఇల్లు వదిలి పారిపోయింది. దీనితో గోవిందు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో తన పెద్ద కూతురు పారిపోయిందని ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసుగా పోలీసులు నమోదు చేస్తున్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ అమ్మాయిని కనిపెట్టి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి ఇంట్లో నుండి ఎందుకు పారిపోయావని విచారించగా పెంపుడు తల్లిదండ్రులు నాతో, మా చెల్లితో వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పి ఏడ్చింది. ఈ విషయాన్ని విన్న పోలీసులు వెంటనే గోవిందును అరెస్ట్‌ చేసి లక్ష్మీ పై కేసు నమోదు చేశారు.

English summary

A couple named Padma and Ramesh had two daughters and Ramesh died with heart attack when his children was small and later Padma was aslo affected mentally.Later The two daughters was adopted by Govindu And Lakshmi.The couple forced the two daughters to do prostitution for money.Their first daughter said police all these things and the parents have been arrested and put them in Jail.