తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి శాపాలుగా తగులుతాయా?

Parents sins is applicable to children

10:25 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Parents sins is applicable to children

మన ధర్మంలో ఎన్నో సూక్ష్మాలున్నాయి. పిల్లలు ఏదైనా చేస్తే అది పెద్దలకు వర్తిస్తుంది. అందుకే ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ల తల్లిదండ్రుల బుద్ధులు, లక్షణాలు అంటారు. చాలా గొప్పవాడు అయినా అమ్మా నాన్నల పుణ్యమేనని చెప్పుకుంటారు. కేవలం తల్లిదండ్రుల పాప పుణ్యాలే కాకుండా తాత ముత్తాతల పాప పుణ్యాలు కూడా మనకు కొంత వరకు సంక్రమిస్తాయి. అయితే మొత్తం కాకపోయినా కేవలం కొద్ది భాగమైనా మనకు తగులుతాయట. అందుకే మనం ఏ పాపం చేయకపోయినా కూడా కొన్ని శిక్షలను అనుభవిస్తుంటాం. ఇదేమిటి నేను చేయని పాపానికి నాకు శిక్ష ఏమిటి అనుకుంటున్నారా? ఇలా మనం చేయని పాపాలకు శిక్ష పడకుండా ఉండడానికే దైవారాధన, దానాలు గురించి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి.

మనం చేసిన పాపాలకు ఎలాగో శిక్షలు ఉంటాయి కాని.. పెద్దలు, తర తరాలుగా వస్తున్న పాప దోషాల నివారణకు మాత్రం దానాలు చేయడం, దైవారాధన చేయడం, దోష నివారణ పూజలు చేయించుకోవడం తప్పనిసరిగా చేయాలని అంటారు.

English summary

Parents sins is applicable to children