మనీష్ తో డేటింగ్ గురించి పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు

Parineeti Chopra About Relationship With Manish Sharma

11:14 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Parineeti Chopra About Relationship With Manish Sharma

వెండితెర మీద ఎంత బోల్డ్‌గా ఉంటుందో నిజజీవితంలో కూడా అంతే స్పష్టమైన అభిప్రాయాలతో విలక్షణంగా కనిపించే పరిణీతి చోప్రా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. అక్క ప్రియాంకా చోప్రాను చూసి సినిమాల్లోకి వచ్చినా, ఆమెను ఏనాడూ అనుసరించకుండా తన వ్యక్తిత్వంతోనే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న స్పెషాల్టీ. నటి పరిణీతి... దక్షిణాది దర్శకనిర్మాతలు ఎవరూ నా దగ్గరకి రాలేదని, వస్తే చేయడానికి నేను రెడీ అని చెబుతోంది. జీవిత భాగస్వామిగా ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారని అడిగితే, 'మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. జీవితంలో ఏదన్నా సాధించాలన్న తపన ఉండాలి. నా భావాలను గౌరవించాలి. భర్త చెప్పే ప్రతి మాటకూ తలూపే భార్యగా ఉండడం నా వల్ల కాదు. నేను చెప్పే విషయం వినకుండా తన మాటే నెగ్గాలనుకునే వ్యక్తిని అస్సలు భరించలేను. వెంటనే అతని నుంచి విడిపోతా' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తోంది.

ఇవి కుడా చదవండి : సన్నితో నటించాలని ఉంది

'ఇక ఇప్పటికీ నేను సింగిల్‌గానే ఉంటున్నా. కొద్దిసేపు కలిసి మాట్లాడితే, కలిసి టైం స్పెండ్‌ చేస్తే, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టూ, డేటింగ్‌ చేస్తున్నట్టేనా? మనీష్‌ శర్మతో నాకు మంచి స్నేహం ఉంది. ఒకరి భావాలు మరొకరం పంచుకుంటాం. ఇద్దరం మాట్లాడుకుంటుంటే టైం తెలియదు. దాన్ని చూసి మేం ఇద్దరం ప్రేమలో ఉన్నామనీ, డేటింగ్‌లో ఉన్నామనీ పుకార్లు పుట్టించేస్తే ఎలా? 'అని ప్రశ్నిస్తున్న ఈ అమ్మడు పెళ్ళయినా, సహజీవనం అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన ఉంటేనే సాఫీగా సాగుతుందని అంటోంది. 'సహజీవనం అంటే ఒకే ఇంట్లో కలిసి ఉండడం కాదు. విడివిడిగా ఉన్నప్పటికీ కలుసుకున్న కొన్ని గంటలైనా ఆనందంగా గడపగలగాలి. నా దృష్టిలో అది కూడా సహజీవనమే!'అని చెప్పే పరిణీతి , మనీష్ తో అలాంటి ఆనందం పొందు తోందా ?`

ఇవి కుడా చదవండి :

ప్రత్యూష గర్భవతా!?

ప్రియాంక చోప్రా ఆత్యహత్యాయత్నం

ఐటెం సాంగ్ కీ రెడీ

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

English summary

Bollywood heroine Paraneeti Chopra Says That No South Producers or Directors were contacted her and that's the reason i did not acted in South films upto now.She says that she and Manish Sharma were good friends.