మహేష్ సినిమాకి పరిణీతి చోప్రా ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?

Parineeti Chopra demanding 3 crores for Mahesh Babu movie

11:36 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Parineeti Chopra demanding 3 crores for Mahesh Babu movie

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను సంప్రదించినట్లు ఇటివలే ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే ఇప్పుడు ఇది రూమర్ కాదు, మహేష్ సరసన పరిణీతి చోప్రా అయితే బాగుంటుందని దర్శక-నిర్మాతలు భావించారట. ఇందుకు మహేష్ కుడా ఓకే చెప్పాడట. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ అమ్మడు భారీగా డిమాండ్ చేస్తూ నిర్మాతలను షాక్ కి గురి చేసిందని టాక్. ఇక తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయనున్నారు.

అంటే రెండు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఎప్పటి నుండో సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఈ బాలీవుడ్ భామకి ఇలా స్టార్ హీరో మహేష్ సినిమా రూపంలో రెండు భాషల్లోనూ ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. ఇంత మంచి అవకాశం రావడంతో తెగ ఆనందపడిపోయిందట ఈ అమ్మడు. మరి మహేష్ వంటి సూపర్ స్టార్ సినిమాతో ఎంట్రీ అంటే ఓ మోస్తారు విజయం అందుకున్నట్లే కదా. అందులోకి తమిళ దర్శకుడు కావడంతో అక్కడ కూడా ఈ సినిమాకు అంచనాలతో పాటు మంచి ఓపినింగ్స్ కూడా లభిస్తాయి. ఇవన్నీ భావించి రెండు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు దాదాపు 3 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందని ముంబై టాక్.

మరి ఇంతకి ఈ అమ్మడు అడిగినంతా ఇచ్చి కథానాయికగా నిర్మాతలు ఫైనల్ చేస్తారా? లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

English summary

Parineeti Chopra demanding 3 crores for Mahesh Babu movie