వామ్మో, సూపర్ స్టార్ మూవీలో అసలు ఏమి జరుగుతుంది ..!

Parineeti Chopra Did Not Sign Mahesh Babu Movie

11:51 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Parineeti Chopra  Did Not Sign Mahesh Babu Movie

ఏదైనా సినిమా అంటే చాలు, కొన్ని వందల వార్తలు హల్ చల్ చేసేస్తాయి. ఓపినింగ్ నుంచి, ఎండింగ్ వరకూ లెక్కకు మించి ప్రమోషన్ వార్తలు వస్తాయి. ఇందులో కొన్ని నిజాలు వున్నా , చాలా వరకూ ఊహాగానాలే రాజ్యమేలుతాయి. సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఓ ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా వార్తలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మూవీకి సంబంధించి తొలుత హీరోయిన్ గా పరిణీతి చోప్రా ఓకే అయ్యింది. ఐతే, ఎందుకు డ్రాపయ్యింది? రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆమె వైపు మొగ్గు చూపలేదంటూ పుకార్లు షికారు చేశాయి. కానీ అసలు విషయం అదికాదట.

ఈ ప్రాజెక్ట్ కోసం తనని మేకర్స్ సంప్రదించిన మాట వాస్తవమేనని పరిణీతి క్లారిటీ ఇచ్చింది. తాను కాల్షీట్స్ చూసుకుని చెబుతానని అన్నాననీ, ఈలోగానే ప్రిన్స్ పక్కన హీరోయిన్ గా తాను ఓకే అన్నట్లు ప్రచారం జరిగిపోయిందని వాపోయింది. చివరకు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేశానని, అందువల్లే డ్రాపైనట్టు వస్తున్న గాసిప్స్ లో నిజంలేదని వివరణ ఇచ్చుకుంది పాపం. కాల్షీట్లు సెట్ కాకపోవడంతో తాను వదులుకున్నానని పరిణీతి చెబుతోంది . ఏదైతేనేం సౌత్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఛాన్స్ ని వదులుకుంది. ఇప్పుడీమె ప్లేస్ లో రకుల్ హీరోయిన్ గా వచ్చిన సంగతి తెల్సిందే.

ఇది కూడా చూడండి: 29మందితో ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సయ్యింది

ఇది కూడా చూడండి: ఎవరూ ఊహించని పాత్ర ఇది .. మేకప్ కే 6 గంటలు పెట్టేసిందట

ఇది కూడా చూడండి: భారత దేశం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు

English summary

Parineeti Chopra Did Not Sign Mahesh Babu Movie.