ప్రిన్స్ తో నటించే భామ రేటు తెలిస్తే షాకవుతారు!

Parineeti Chopra remuneration for Mahesh Babu movie

11:10 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Parineeti Chopra remuneration for Mahesh Babu movie

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయిన పరిణీతి చోప్రాకి ఇప్పుడు టాలీవుడ్ లో అడిగినంతా ఇస్తున్నారు. వాస్తవానికి ఈ భామకి క్రేజ్ వున్నా, అక్క ప్రియాంకా చోప్రా అంత ఫేమస్ కాదు. అయితే ఈ విషయాన్ని టాలీవుడ్ దర్శకనిర్మాతలు గుర్తించినట్టు లేదు, అందుకే అడిగినంత ఇస్తున్నారట అంటున్నారు సినీజనాలు. ఇంతకీ విషయం ఏమంటే, మహేష్ బాబుకు జంటగా తెలుగు సినిమాలో నటించేందుకు పరిణీతి ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు అడిగితే ఆ సినిమా దర్శకనిర్మాతలు ఇక ఏమి మాట్లాడకుండా ఓకే చెప్పేశారట! ఎంత బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటూంటే మాత్రం అంత రెమ్యునరేషన్ అవసరమా? అన్నది కొందరి అనుమానం.

అంతకన్నా ఎక్కువ టాలెంటు ఉన్న తెలుగమ్మాయిలు ఉండగా, ఉత్తరాది భామను దింపవలసిన అవసరం ఏమిటి? అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎందుకు అంత రేటు పోస్తున్నారో నిర్మాతలకు తెలియాలి.

English summary

Parineeti Chopra remuneration for Mahesh Babu movie