23నుంచి  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!!

Parliament Sessions To Start On February 23rd

06:37 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Parliament Sessions To Start On February 23rd

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వే, సాధారణ బడ్జెట్‌లు సభలో ప్రవేశ పెట్టడం, వాటిపై చర్చలు జరుగుతాయి. వీటితోపాటు రియల్‌ ఎస్టేట్‌బిల్లు, వస్తుసేవల బిల్లు తదితర ముఖ్య బిల్లులు వీటిల్లో పాస్‌కావాల్సి ఉంది. దీంతో ప్రభుత్వానికి ఈ సమావేశాలు కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే ఏటా బడ్జెట్‌ సమావేశాలు సాధారణంగా ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభమై మే మొదట్లో ముగుస్తుంటాయి.కాగా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీతో హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫిబ్రవరి 4న సమావేశమై , సమావేశాల షెడ్యుల్‌ ఖరారు చేస్తారు.అయితే ఈ సమావేశాలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచే మొదలవుతాయని నమ్మకంగా చెబుతున్నారు

English summary

Parliament Sessions to be held on February 23rd.In this sessions Railway Budget and few other budgets to be announced . Rajnadh Singh Conducts meeting on February 4th and takes decision on the date of Parliament Sessions