పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేనా ?

Parliament Winter Sessions Starts Tomorrow

11:40 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Parliament Winter Sessions Starts Tomorrow

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతుండడంతో అన్ని పక్షాలు సిద్ధమవుతున్నాయి. బిహార్ ఎన్నికలలో నితీష్ , లాలూ టీం గెలుపు - ఎన్ డి ఎ ఓటమి నేపధ్యంలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలు ఇవి. పైగా దేశంలో అసహన పరిష్టితులు నెలకొన్నాయని విమర్శలు రావడం , కొంతమంది రచయితలు తమ అవార్డులను వాపసు చేయడం , దీనికి తోడు బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు , తదితర పరిణామాల నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడీ వేడీ గానే ఉంటాయనడంలో సందేహం లేదు.

శీతాకాల సమావేశాల్లో కొన్ని కీలకమైన బిల్లులను ఆమోదింప జేయాలని ప్రభుత్వం భావిస్తూ , ఆదిశగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేశారు. మరో పక్క వివిధ పక్షాల ఫ్రోర్ లీడర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమై, శీతాకాల సమావేశాలు సాఫీగా సాగడానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం అనుకున్నట్టే సజావుగా సమావేశాలు ఉంటాయా , విమర్శలు- ప్రతి విమర్శలతో దద్దరిల్లుతాయా ..?

English summary

Parliament Winter Season Sessions Starts tomorrow. Do Parliament inter sessions go smmoothly? this question was raising on everyones mind because the issuesa happend in the country against BJP government like bihar elctions , ameer khan words on intolerance in india etc