ఆ వీడియో అభిమానికి దొరికేసింది

Parneeti Chopra First On-Screen Video

07:00 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Parneeti Chopra First On-Screen Video

మొదటి సారిగా తెరమీదికి వచ్చాను, తొలిసారి తళుక్కు మని మెరిసిన వేళ, తొలిసారి మేకప్ వేసుకున్న సమయం, తొలి పారితోషికం మిగిల్చిన సంతోషం... ఇలా పలు అంశాలను పూసా గుచ్చినట్లు చెప్పడం సినీ స్టార్స్ కి అలవాటే. అయితే ఒక్కోసారి కొన్ని విషయాలు మరచిపోతారు. కానీ అభిమానులకు అన్నీ గుర్తే. అలాంటిదే ఓ సంఘటన చోటుచేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా 2011లో ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ బెహల్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే అందరికీ తెలియని ఓ కొత్త విషయం ఇటీవల తెరమీదికొచ్చింది. వాస్తవానికి ఆమె కూడా మరచిపోయిందట. ఇంతకీ అదేమిటంటే.. ఆమె 2003లోనే తొలిసారి బుల్లితెరపై కన్పించిందట. ఆమె తొలిసారి టీవీలో కన్పించిన వీడియోను ఓ అభిమాని సంపాదించి ట్విట్టర్‌ ద్వారా ఆమెకు చేరవేయడం, ఆ వీడియోను ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేస్తూ.. తన సోదరుడు శివాంగ్‌తో (వీడియోలో నీలం రంగు చొక్కా) కలిసి దూరదర్శన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం కోసం నిర్వహించిన స్వరసంగమ్‌ కార్యక్రమంలో పాఠశాల తరపున పాల్గొన్నట్లు వివరించింది. అభిమాని చెబితే కానీ గుర్తు రాలేదంటే, ఆ అభిమాని నిజంగా గ్రేట్. అందుకే ఈ వీడియోను వెదికిపట్టుకున్న అభిమానికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేసింది.

English summary

Bollywood heroine Parineeti Chopra's first ever on screen video was posted by her fan and Parineeti chopra says thanks to him and posted her first ever on screen appearance video on Facebook.