పరోటాలు తినే పోటీ... 25 పరోటాలు తింటే భారీ ప్రైజ్ మనీ

Parotta eating competition

12:35 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Parotta eating competition

తినడం కూడా ఓ ఆర్ట్... సుష్టుగా తిని, పుష్టిగా వుండాలని పెద్దలు అంటారు. లావు ఎక్కిపోతామనే భయంతో ఎదో మొక్కుబడిగా తినడం తప్ప, గట్టిగా తినే రోజులు పోయాయి. భోజన ప్రియులు కూడా తగ్గిపోతున్నారు. అయితే భోజన ప్రియులను ఎంకరేజ్ చేయడానికి, ఆకట్టుకునేందుకు తమిళనాడులోని పరిశ్రమల నగరం కోయంబత్తూర్ లో ఓ హోటల్ యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 25 పరోటాలు తినే వారికి రూ. 5,001 బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అన్నూర్ గణేశపురంలోని ఈ హోటల్ లో వినాయకచవితి సందర్భంగా వచ్చే 5, 6 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పోటీ జరుగుతుంది.

ఇందులో ఒక వ్యక్తి 25 పరోటాలు ఆరగిస్తే బహుమతిగా రూ.5,001 సొంతం చేసుకోవచ్చు. ఈ వినూత్న పోటీలో పాల్గొనేందుకు ఈ నాలుగు రోజుల్లో 2 వేల మంది మొబైల్ ద్వారా, మరో 200 మంది నేరుగా వెళ్లి పేర్లను నమోదు చేసుకున్నారని హోటల్ యజమాని రాజేష్ వివరించాడు. మరి విజేత ఎవరో..?

ఇది కూడా చదవండి: 'జనతా' పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు

ఇది కూడా చదవండి: 3కోట్లతో ‘భాగమతి’ భారీ సెట్!

English summary

Parotta eating competition