విమానంలో మూత్ర విసర్జన - భారీ జరిమానా

Passenger urinates on board flight

12:46 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Passenger urinates on board flight

కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం, ఎక్కడబడితే అక్కడ మల మూత్ర విసర్జన చేయడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు అది ఎయిర్ పోర్ట్ లోకి కాదు కాదు , ఏకంగా విమానంలోకే పాకింది. అయితే ఇందుకు భారీ జరిమానాయే పడింది. వివరాల్లోకి వెళ్తే, మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమానంలో మూత్ర విసర్జన చేసి తోటి ప్రయాణికుల ఆగ్రహం కల్గించాడు. ఇందుకుగాను ఆ ప్రయాణికుడికి వెయ్యి పౌండ్ల జరిమానా కూడా విధించారు. గత నెల 19న జిను అబ్రహం అనే 39 ఏళ్ళ వ్యక్తి భారత్‌ నుంచి బిర్మిన్‌ఘామ్‌కి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించాడు. అబ్రహం వెంట అతని పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆయన గారు, తాను కూర్చున్న సీటు బెల్టు తొలగించి, సిబ్బంది ఎంత వారిస్తున్నా వినకుండా మూత్ర విసర్జన చేసేసాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన ప్రవర్తనతో ఆగ్రహం చెందిన ఎయిరిండియా సిబ్బంది, ఆయన్ను అరెస్టు చేసి, విమానం ల్యాండైన అనంతరం అతన్ని బిర్మిన్‌ఘామ్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనకు వెయ్యి పౌండ్లు జరిమానా న్యాయస్థానం విధించింది.

English summary

A drunken passenger on Air India flight from India to Birmingham was fined with heavy ammount of 1,000 pounds for urinating on board flight and irritating passengers on the flight.