కొచ్చిన్‌ విమానం మళ్లీ మిస్‌!

Passengers Concern At Shamshabad AirPort

11:39 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Passengers Concern At Shamshabad AirPort

పొరపాటు గ్రహపాటు ... ఏమరుపాటు ... ఏదైనా కానివ్వండి శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ విమానాల మిస్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం కొచ్చిన్‌ వెళ్లాల్సిన పది మంది ప్రయాణికులను వదిలేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆదివారం కూడా మరో 13 మంది ప్రయాణికులకు కూడా అదే ఇబ్బందిని రుచి చూపించింది. కొచ్చిన్‌ వెళ్లే విమాన ప్రయాణికులకు కొత్త చిక్కు వచ్చిపడింది.

ఇవి కూడా చదవండి: 1720 రూపాయలకు తల్లిని చంపేసాడు

విమానం బయలుదేరే సమయంలో వచ్చే ప్రకటనలో జరుగుతున్న పొరపాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే 6ఇ 413 ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం కొచ్చిన్‌ మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఆదివారం 13 మంది ప్రయాణికులు ఈ విమానంలో కొచ్చిన్‌ వెళ్లడానికి టికెట్లు తీసుకున్నారు. వారు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని బోర్డింగ్‌ పాస్‌ కూడా తీసుకున్నారు. అయితే, హైదరాబాద్‌-బెంగళూరు వయా కొచ్చిన్‌ అనే ప్రకటనకు బదులు హైదరాబాద్‌-బెంగళూర్‌ విమానం బయలుదేరుతుందని రావటంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. తేరుకునే లోపే వారు ప్రయాణించాల్సిన విమానం వెళ్లిపోయింది. దీంతో విమానం ఎక్కలేకపోయిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్పందించిన ఇండిగోఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యం మరో విమానంలో కొచ్చిన్‌కు పంపిస్తామని హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. ఇక నుంచైనా సక్రమంగా వ్యవహరించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతాం.?

జడేజా పెళ్లిలో కాల్పులు - పోలీసుల దర్యాప్తు

English summary

Passengers Concern at Shamshabad Airport for giving wrong information about the flight. Later Indigo Airlines promised that they will arrange anther flight for them.