ప్రయాణికులను గాలికొదిలేసిన ఇండిగో ...

Passengers Troubled By Indigo Airines

09:54 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Passengers Troubled By Indigo Airines

టికెట్స్ కొనుక్కుని రెడీగా వున్న ప్రయాణికులను ఓ విమానయాన సంస్థ గాలికొదిలేసింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా శంషాబాద్‌ విమానాశ్రయంలోనే పడిగాపులు గాసారు. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది నిర్వాకం వల్ల 70మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వివరాలోకి వెళితే, హైదరాబాద్‌ నుంచి చత్తీస్‌ఘడ్‌లోని రాయచూర్‌కు వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణం కోసం 70మంది బృందంగా టికెట్లు తీసుకున్నారు. పెళ్లికి హాజరయ్యేందుకు విమానం ఎక్కారు. సీట్లలో కూర్చునే విషయమై ఇండిగో విమాన సిబ్బంది దురుసుగా మాట్లాడినట్లు ప్రయాణికులు చెప్పారు. ఈ విషయంలో ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. సిబ్బంది దరుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ 70మంది ప్రయాణికులు విమానం నుంచి దిగారు. ఏదో విధంగా సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమణచాల్సిన అధికారులు కూడా పట్టించుకోలేదు. 70 మంది ప్రయాణికులను వదిలేసి విమానాన్ని పంపించేశారు. దీంతో ప్రయాణికులు రాత్రంతా శంషాబాద్‌ విమానాశ్రయంలోనే పడిగాపులు పడ్డారు. ఇండిగో సంస్థ తీరుపై ప్రయాణికులు, ప్రయాణికుల తీరుపై ఇండిగో అధికారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాల్లో తీసికెళ్ళా ల్సిన విమానం గాలికొదిలేసింది.

English summary

70 Passengers who have purchased tickets from Hyderabad to Chattisgarh was troubled by Indigo Airlines due to small issue took place on seats adjustment between air lines staff and passengers