డార్క్‌బోట్‌ రెచ్చిపోతోంది..

Password-Stealing Dorkbot Virus

10:27 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Password-Stealing Dorkbot Virus

ఇంటర్నెట్ వినియోగదారులకు మరో కొత్త వైరస్ గండం పొంచిఉంది. ఇటీవలి కాలంలో డార్క్‌బోట్‌ అనే ఆన్‌లైన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తోందట. దీంతో జాగ్రత్తగా ఉండాలని భారత కంప్యూటర్‌ అత్యవసర ప్రతిస్పందన బృందం (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరిస్తోంది. సామాజిక వెబ్ సైట్ల ద్వారా చొరబడే ఈ వైరస్ పాస్‌వర్డ్‌లతో పాటు వ్యక్తిగత రహస్య సమాచారాన్ని అపహరిస్తుందని వెల్లడించింది. ఈ వైరస్‌ ముఖ్యంగా విండోస్‌పై నడిచే ఆపరేటింగ్‌ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తాజా హెచ్చరికలో పేర్కొంది. ఇది కంప్యూటర్‌లో నిక్షిప్తమైన పాస్‌వర్డ్‌లతో పాటు ఆపరేటింగ్‌ వ్యవస్థ, బ్రౌజర్‌, కుకీలు, యాప్స్‌ వంటి వాటి సమాచారాలను సేకరిస్తుంది. ఆపరేటింగ్‌ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకోగలదు కూడా. ఓవర్‌ రైటింగ్‌ ద్వారా కనబడకుండా దాచుకోగల ఈ వైరస్‌ ఇతర కంప్యూటర్ల నుంచి దాడికి పాల్పడే వారికి తోడ్పడుతుంది. యాంటీవైరస్‌లు తనను గుర్తించకుండా ఇది సీఎమ్‌డీ.ఈఎక్స్‌ఈ, ఐపీకాన్‌ఫిగ్‌.ఈఎక్స్‌ఈ, రెమిడిట్‌.ఈఎక్స్‌ఈ, రన్‌డీడీఎల్‌32.ఈఎక్స్‌ఈ, ఎక్స్‌ప్లోరర్‌.ఈఎక్స్‌ఈ వంటి ఫైళ్లలోకి తన సంకేతాన్ని జొప్పిస్తుందట.

English summary

Indian internet users was warned against the malicious activity of an online virus called 'dorkbot' which perpetrates itself through social networking sites and steals sensitive personal data and passwords of a internet user