ఒకప్పుడు బ్యాంకు అకౌంట్ కూడా లేదు.. కానీ ఇప్పుడు 25వేల కోట్లకు అధిపతి!

Patanjali company owner assets was 25 thousand crores

03:45 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Patanjali company owner assets was 25 thousand crores

చేతిలో చిల్లిగవ్వ ఉండదు. కొన్నాళ్ళకు కోట్లకు పడగలెత్తేస్తారు. అపర కుబేరులైపోతారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. అయితే ఇక్కడ కూడా అలాంటిదే కానీ అతని వెనుక ఓ యోగా గురువు వున్నాడు. ఇంతకీ ఎవరనే అనుమానమా? ఎవరెంటే, బాబా రాందేవ్ శిష్యుడు, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ అపర కుబేరుల జాబితాలో 25వ వాడిగా అవతరించారు. చైనా పత్రిక హూరన్ వెల్లడించిన వివరాల ప్రకారం బాలకృష్ణ వద్ద రూ. 25,600 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ధోతి, కుర్తా ధరించే ఈ 44 ఏండ్ల సన్యాసి గత పదేండ్లుగా రాందేవ్ కు కుడిభుజంగా ఉన్నారు.

339 మందితో కూడిన ఇండియా రిచ్ లిస్ట్-2016 లో ఆయనకు 25వ స్థానం లభించడమనేది ఏ విధంగా చూసినా మామూలు విషయం కాదు. ఎస్సార్ రూయా సోదరులు, బ్రిటానియా నుస్లీ వాడియా వంటి కార్పొరేట్ దిగ్గజాలను కూడా ఆయన వెనక్కి నెట్టేశారు. పతంజలి టర్నోవర్ రూ. 5 వేల కోట్లని ఇటీవలే రాందేవ్ చెప్పారు. ఐదేండ్ల క్రితం బాలకృష్ణ తనకు బ్యాంకు అకౌంట్ కూడా లేదని చెప్పారు. ఇప్పుడు పతంజలిలో ఆయన 94 శాతం షేర్లు కలిగి ఉన్నారు. హూరన్ జాబితాలో డాబర్ కు చెందిన ఆనంద్ బర్మన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 41,800 కోట్లు.

1/4 Pages

బడా బ్రాండ్...


పతంజలి ఇప్పుడు దేశంలో ఇంటింటి బ్రాండ్ గా మారిపోయింది. భారత్ లో అదిప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ(వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) బ్రాండ్ గా ఉందని హూరన్ వెల్లడి చేసింది. 2015-16లో భారతీయ మార్కెట్ లో పతంజలి బ్రాండ్ 150 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం పతంజలి వార్షిక టర్నోవర్ రూ. 5,000 కోట్లు. 2017లో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది అని హూరన్ నివేదిక తెలిపింది. హూరన్ పత్రిక ప్రతి యేటా చైనాలో ధనికుల జాబితాను తయారు చేస్తుంది. 2012 నుంచి అది ధనికులైన భారతీయ సీఈవోల జాబితా విడుదల చేస్తూ వస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం పతంజలి ఆయుర్వేద్ లో బాలకృష్ణ 94 షేర్లు కలిగి ఉండగా, బాబా రాందేవ్ దానికి ప్రమోటర్ గా ఉన్నారు.

English summary

Patanjali company owner assets was 25 thousand crores. Baba Ramdev disciple earned 25 thousand crores in 5 years.