పఠాన్‌కోట్‌ లో దాడి చేసింది మేమే : యూజేసీ

Pathankot Air Base Was Attcaked By United Jihad Council

11:08 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Pathankot Air Base Was Attcaked By United Jihad Council

పంజాబ్‌ లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ పై దాడి చేసింది మేమే అంటూ పాకిస్ధాన్‌ లో ఆశ్రమం పోందుతున్న యునైట్‌ జిహాద్‌ కౌన్సిల్‌ (యూజేసి) ఉగ్రవాద సంస్ధ ప్రకటించుకుంది. పాకిస్ధాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తీవ్రవాదులు ఈ దాడిలో పాల్గోన్నారని యూజేసి ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది. యునైట్‌డ్‌ జిహాద్‌ కౌన్సిల్‌ అనుభంద ఉగ్రవాద సంస్ధకు చెందిన హైవే స్క్వాడ్‌ సభ్యులు ఎయిర్‌బేస్‌ స్ధావరం పై దాడులు చేసినట్లు వారు ప్రకటించారు. యూజేసి అంతిమ లక్ష్యం కాశ్మీర్‌ అని ఆ సంస్ధ ప్రతినిధి సయ్యద్‌ సదాకత్‌ హుస్సేన్‌ తెలిపారు. అయితే ఆ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.

పఠాన్‌ కోట్‌ దాడిలో ఇప్పుటి వరకు భద్రాతాదళాల కాల్పులో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదులను , భద్రతాదళాలు సమర్ధంగా ఎదుర్కోన్నాయని, ఎయిర్‌ బేస్‌ స్ధావరంలో పరిస్ధితులు అదుపులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

English summary

United Jihad Council (UJC) had claimed that they had attacked pathankot air base station in punjab