ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్ అయిన ఎస్పీ

Pathankot Kidnapped SP Salwinder Singh Talks To Media

11:14 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Pathankot Kidnapped SP Salwinder Singh Talks To Media

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ స్థావరం పై ఉగ్రవాదుల దాడికి ముందు కిడ్నాప్ అయ్యి ఆ తరువాత విడుదలైన గురుదాస్‌పూర్‌ ఎస్వీ సల్వీందర్‌ సింగ్‌ను అధికారులు విచారణ చేసారు. అధికారులు సల్వీందర్‌ ను దాదాపు గంటసేపు ప్రశ్నించారు.

ఇది ఇలా ఉంటే ఉగ్రవాదుల చెరలో నుండి బయటపడ్డ సల్వీందర్‌ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌ 31 వ తేదీ రాత్రి తాను తన డ్రైవరు ఒక కారులో కలిసి పంజాబ్‌ సరిహద్దు ప్రాంతంలోని ఒక ఆలయానికి వెళ్ళి వస్తుండగా అటుగా వచ్చిన నలుగురు ఉగ్రవాదులు ఏకే 47 గన్‌లతో తమను బెదిరించి తమ కాళ్ళు చేతులను కట్టేసి తమను కిడ్నాప్‌ చేసారని అన్నారు. నోటికి, కళ్ళకు ప్లాస్టర్‌ వేసి ఏమీ కనపడకుండా చేసారని అన్నారు. తాను ఒక పోలీసు అధికారినని ఆ ఉగ్రవాదులకు తెలియదని, ఆ ఉగ్రవాదులంతా హిందీ, ఉర్దూ భాషలలో మాట్లాడుతున్నారని వివరించారు. ఆ సమయంలో తనతో పాటు డ్రైవర్‌, మరో వ్యక్తి కూడా ఉన్నారని తెలిపాడు. తనను విడుదల చేసిన తరువాత వాళ్ళకు నేను పోలీసు అధికారినని తెలిసిందని, ఆ తరువాత వాళ్ళు తన దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు సల్వీందర్‌ తెలిపాడు. ఆ తరువాత వెంటనే ఈ విషయాన్ని సర్దాస్‌పూర్‌ ఎస్‌ఎస్పీకి తెలిపానని చెప్పాడు. మా దగ్గర ఆయుధాలు ఏమి లేవు కనుకనే తాము వాళ్ళతో పోరాడలేదని అన్నారు. ఒకవేళ ఆయుధాలు ఉంటే ఉగ్రవాదులతో తప్పకుండా పోరాడేవాడినని అన్నారు. పఠాన్‌కోట్‌ లో ఉగ్రవాదులు ఎంతటి భీబత్సాన్ని సృష్టించారో తెలిసిందే.

English summary

Gurudaspur Police Superintendent Salwinder Singh was kidnapped by terrorists ion 31st december when he was going to temple on that day night.Later they have warned him and released him.Yesterday officers investigate him on that incident for almost one hour