సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

Pavan Kalyan Fan Sells His Home For Sardaar Gabbar Singh Tickets

01:25 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Pavan Kalyan Fan Sells His Home For Sardaar Gabbar Singh Tickets

అవును మీరు విన్నది నిజమే , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్దార్ గబ్బర్ సినిమా కోసం మెగా అభిమానులందరూ కళ్ళు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సర్దార్ సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

కేవలం తెలుగు లోనే కాక బాలీవుడ్ లో సైతం రికార్డు స్థాయిలో 800 ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే సర్దార్ సినిమా 100 కోట్ల బిజినెస్ చేసిందంటే ఈ సినిమా కు క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకునే పవన్ అభిమానులు , ఇక పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు. ఎలా అయినా తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ను మొదటి రోజే చూసి తీరాలని అనేక మంది అభిమానులు సర్దార్ టికెట్ల కోసం ముందు రోజు నుండే లైన్ లో నిలబడి నిరీక్షిస్తుంటారు.

తాజాగా కర్నూల్ జిల్లా కు చెందినా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమాన హీరో సినిమా కోసం ఏకంగా తన ఇంటినే సైతం అమ్మేశాడు . సర్దార్ సినిమా టికెట్ల కోసం తన సొంత ఇంటిని 10 లక్షలకు అమ్మేసి , ఆ 10 లక్షలు పెట్టి పవన్ కళ్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా షో టికెట్లను కొన్నాడు . ఈ ఒక్క ఘటన చాలు పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవడానికి . ఇక విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ క్రియెట్ చేస్తున్న సర్దార్ సినిమా ఇంకా విడలైయ్యాక ఇంకెన్ని రికార్డు లు సృష్టిస్తుందో వేచి చూడాలి.

ఇవి కుడా చదవండి :

సింగర్ పై సీరియస్ అయిన త్రిష

శ్రీజ వెడ్డింగ్ ఫుల్ వీడియో

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

English summary

Power Star Pawan Kalyan Sardaar Gabbar Singh Movie Was Going to release on the Occasion of "Ugadi" festival on April 8th.Pawan Kalyan Fans were eagerly waiting for the release of this movie. A Pawan Kalyan fan in Kurnool District Sells his house for sardaar gabbar singh movie tickets.