నాగ్ ఓం నమో వేంకటేశాలో భూదేవి, శ్రీదేవి ఎవరో తెలుసా?

Pavani Gangireddy and Vimala Raman acting in Om Namo Venkatesha movie

05:07 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Pavani Gangireddy and Vimala Raman acting in Om Namo Venkatesha movie

అక్కినేని నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాలు తెరకెక్కించిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరోసారి నాగ్ తో మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశా' తెరకెక్కిస్తున్నాడు. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబా కథతో తెరకెక్కే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జూలై 2 నుండి మొదలవుతుంది. ఇక ఈ చిత్రంలో కీలకమైన సన్యాసి పాత్రలో దేవసేన అనుష్క నటిస్తోంది. ఇక భూదేవి, శ్రీదేవి పాత్రలకు కూడా ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. బాలీవుడ్ యాక్టర్ శౌరబ్ రాజ్ జైన్ వేంకటేశ్వర స్వామిగా నటిస్తుండగా శ్రీదేవి పాత్రకు విమలారామన్ ఇది వరకే ఎంపికైంది.

ఇక భూదేవి పాత్రకు పావని గంగిరెడ్డిని ఎంపిక చూసారు. రీసెంట్ గా స్క్రీన్ టెస్ట్ చేశారు. ఈ మూవీలో ఛాన్స్ రావడం పట్ల పావని సంతోషం వ్యక్తం చేసింది. పావని గంగిరెడ్డి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో పాపులర్ అవ్వగా, ఈ ఏడాది మహేష్ బాబు బ్రహ్మోత్సవం, సుమంత్ అశ్విన్ రైట్ రైట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి యమ్.యమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో వేడుకలో నాగార్జున గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. ఓం నమో వేంకటేశాలో కూడా అదే లుక్ తో నాగ్ కనిపించబోతున్నాడని సమాచారం.

English summary

Pavani Gangireddy and Vimala Raman acting in Om Namo Venkatesha movie