'సర్దార్'లో పవన్-చిరు ఒకే పాటలో?!

Pawan and Chiranjeevi in one song

11:32 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Pawan and Chiranjeevi in one song

పవర్స్టార్ పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల' చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ అగర్వాల్, రాయ్ లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్-చిరంజీవి ఒకే పాటలో డ్యాన్స్ చెయ్యబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే చిరు సర్దార్ సెట్స్ కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిరు సర్దార్ సెట్స్ కి సరదాగా వెళ్లారు అనుకున్నారంతా, కానీ చిరు ఆ పాట షూటింగ్ కే వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. వీరిద్దరూ కలిసి ఒకే పాటలో డ్యాన్స్ చేస్తే నిజంగా అభిమానులకి ఇది పండుగే.

English summary

Power Star Pawan Kayan and MegaStar Chiranjeevi is appearing in one song in Sardar Gabbar Singh movie. This movie is directing by Power fame Bobby. Kajal Agarwal is romancing with Pawan in this movie.