పవన్, మహేష్ లను టార్గెట్ చేసిన అనుమప..

Pawan And Mahesh Are My Favourite Heroes Says Anupama Parameswaran

10:51 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Pawan And Mahesh Are My Favourite Heroes Says Anupama Parameswaran

ఒక్కొక్కరికి అదృష్టం ఇలా కల్సి వస్తుందని అంటారు కదా.. అందుకే అ.. ఆ ఫిల్మ్ తో టాలీవుడ్ లో నటించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అమాంతం ఫేమస్ స్టార్ ఐపోయింది. వాస్తవానికి ఈ మూవీలో ఈమెకు పెద్దగా ప్రయార్టీ లేకున్నా, సమంత కంటే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చైతూ ప్రేమమ్ లో నటిస్తోంది. ఇక ఈ అమ్మడు టాలీవుడ్ పై బానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, మీ ఫేవరేట్ హీరో ఎవరని ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఒకరు పవన్ కల్యాణ్ కాగా, మరొకరు మహేష్ బాబు అంటూ ఠక్కున సమాధానం ఇచ్చేసిందట. మొత్తానికి పట్టుమని 10 సినిమాలైనా చేయకుండానే ఒక్క సినిమాతో స్టార్ హీరోల పేర్లు ఎలా చెప్పిందంటూ సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక టాలీవుడ్ కి వచ్చిన కొత్తలో రకుల్ కూడా ఇలాగే చెప్పింది. పవన్ పక్కన ఏమోగానీ మాగ్జిమమ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిందని గుర్తు చేస్తున్నారు. మరి రేపటి రోజున రకుల్ వారసత్వాన్ని అనుపమ అందిపుచ్చుకుంటుందా అని అనిపించక మానదు.

పవన్ కల్యాణ్ ఎంత వినయంగా కనిపిస్తారో.. ఆయన్ని ఫస్ట్ టైమ్ కలిసి మాట్లాడిన మాటలు చెప్పలేనని అనుమప అంటోంది. ఇంతగా టాలీవుడ్ హీరోలకు ఎలా ఎట్రాక్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఇటు పవన్, అటు ప్రిన్స్ అభిమానులు చర్చ మొదలుపెట్టేశారు. అ..ఆ సెట్స్ కి పవన్ వెళ్లినప్పుడు అప్పుడు మాట్లాడి వుండవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: 'బూబ్స్ బీర్' ఛాలెంజింగ్ గురించి విన్నారా(వీడియో)

ఇవి కూడా చదవండి:'శాతకర్ణి' ఫస్ట్ లుక్

English summary

Malayalam Heroine Anupama Parameswaran who were acted in Nithin's A.Aa..movie was recently said in a interview that Power Star Pawan Kalyan and Super Star Mahesh Babu Were her Favourite Heroes. At Present she was acting in "Premam" movie which was remake of Malayalam Super Hit Film "Premam"