సచిన్‌తో పవన్, రేణు!

Pawan And Renu Desai With Sachin Tendulkar

10:58 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Pawan And  Renu Desai With Sachin Tendulkar

కల్సిన మనసులు దూరంగా వున్నా ఏదో రూపంలో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే ఉంటాయి. అందునా కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఎన్ని విజయాలు సాధించినా ఆ జ్ఞాపకాలే మనతో కడదాకా నిలుస్తాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడిపోయిన రేణూదేశాయ్ ప్రస్తుతం ఆ జ్ఞాపకాలనే నెమరువేసుకుంటోంది. ఇటీవల పవన్ సింగిల్ ఫోటో ఒకటి ట్విట్టర్ లో పెట్టింది. ఇప్పుడు తాజాగా భర్త పవన్ తో కలిసి సచిన్ తో తీయించుకున్న ఫోటో ఒకదానిని పోస్ట్ చేసింది.

ఇది ఇప్పటి ఫోటో కాదు. 2003లో తీయించుకున్న ఫోటో ఇది. ఓ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు 2003లో హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి సచిన్ వచ్చాడు. అదే కార్యక్రమానికి పవన్ , రేణు కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా సచిన్ తో పవన్ , రేణు ఫోటో దిగారు. ఆ ఫంక్షన్ లోనే సచిన్ తో కలిసి వారిద్దరూ డిన్నర్ చేశారు. ఆ ఫోటోను ఇప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది రేణూదేశాయ్ . ఇక పవన్ అభిమానులు ఆనందానికి అవధుల్లేవ్.

ఇది కూడా చూడండి: పవన్ కి సంపూ ఫుల్ సపోర్ట్ ..

ఇది కూడా చూడండి: బాలయ్య కారుకి తప్పిన మరో ప్రమాదం..

ఇది కూడా చూడండి: మెగాకు కిక్కెక్కిస్తున్న తమన్నా ఐటెం ..

English summary

Power Star Pawan and Renu Desai Dinner with Sachin tendulkar in 2003. Renu Desai Sharing this special pic and old memories.