షకలక శంకర్ కు పవన్ బంపర్ ఆఫర్

Pawan Bumper Offer To Shakalaka Shankar

06:02 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Pawan Bumper Offer To Shakalaka Shankar

జబర్దస్త్ ప్రోగ్రాంతో బుల్లితెర పై అడుగుపెట్టి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన షకలక శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. అందుకే జబర్దస్త్ లోని చాల స్కిట్ లను పవన్ కళ్యాణ్ ను ఆధారంగా తీసుకుని చేసినవే. షకలక శంకర్ కు పవన్ పై ఉన్న అభిమానమే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో శంకర్ కు ఛాన్స్ తెచ్చిపెట్టింది.

జబర్దస్త్ తో పాటు అడపా దడపా సినిమాలలో కూడా నటించిన శంకర్ నటన చుసిన పవన్ కళ్యాణ్ శంకర్ కు సర్దార్ లో ఛాన్స్ ఇచ్చాడు. సర్దార్ లో ఒక పాత్రకు నటుడు అవసరమవ్వగా శంకర్ పవన్ కు తన సొంత తమ్ముడిని సిఫార్సు చెయ్యగా ఓకే అన్న పవన్ అతని నటనను పరీక్షించి సర్దార్ లో ఛాన్స్ ఇచ్చాడు.
ఈ విషయాన్ని స్వయంగా షకలక శంకర్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా పవన్ , సర్దార్ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు.


గబ్బర్ సింగ్ చిత్రంలో పోలీస్ స్టేషన్లో జరిగే అంత్యాక్షరి సన్నివేసం ఎంత సూపర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే . అలంటి కామెడీ సీన్లను సర్దార్ లో కుడా పెట్టమని పవన్ డైరెక్టర్ బాబీ ను కోరాడు. దానికి కేవలం షకలక శంకర్ నే కాక జబర్దస్త్ లోని వేణు , సుడిగాలి సుధీర్ ఇంకా కొంత మందికి సర్దార్ ఛాన్స్ ఇచ్చాడు.ఈ చిత్రంలో గబ్బర్ సింగ్ ను మించిన కామెడీ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.

సర్దార్ సినీమాను ఈ సంవత్సరం వేసవికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్ శరత్ మర్రర్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.

English summary

Shakalaka Shankar who was famous in Jabardasth Tv Show.He was the big fan of Power star Pawan Kalyan.Because of his craziness about him Pawan offered him a role in Sardaar Gabbar Singh.As per requirement of another role in the movie shakalaka shankar recommended his brother and pawan gives cahnce to shankar brother in Sardar Movie. Shankar took this issue to his twitter handle and thanked Power Star and the entire movie team for giving him chance