చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ... పవన్ సంచలన నిర్ణయం

Pawan decided to be as Brand Ambassador for Handloom workers

12:24 PM ON 18th January, 2017 By Mirchi Vilas

Pawan decided to be as Brand Ambassador for Handloom workers

సినీ నటులు ఆయా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం తెల్సిందే. ఇక కొన్ని రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంటారు. అయితే డిఫరెంట్ గా వుండే, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో పూర్తిగా వెనుకబడ్డ, కష్టాల్లో కూరుకుపోయిన చేనేత పరిశ్రమకు అండగా ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. చాలా ఏళ్ల క్రితం పెప్సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ తరువాతి కాలంలో తన ఇమేజ్ ఎంత పెరిగినా వేరే కమర్షియల్స్ జోలికి పోలేదు.

అయితే తాజాగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని చేనేత సంఘాల నాయకులు కలిసి నేత కార్మికుల కష్టాలు వివరించి గడిచిన రెండున్నర ఏళ్లలో తెలంగాణాలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపి, వచ్చే నెల మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాలకు విచ్చేసి తమకు అండగా నిలవాలని కోరారు. వారి విన్నపాన్ని అంగీకరించిన పవన్ స్వచ్ఛందంగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు కూడా అంగీకరించి తన వలన వీలైన ప్రతి సహాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి : మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

English summary

Pawan Kalyan decided to be as Brand Ambassador for Handloom workers. Some people do it for commercial benefit but he wants to take their every problems in his own style to government.