డాలీతో రద్దు - త్రివిక్రమ్ తో బెటర్

Pawan Fans says It Is Better To Do Film With Trivikram

10:40 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Pawan Fans says It Is Better To Do Film With Trivikram

సర్దార్ డిజాస్టర్ తర్వాత విజయం కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. తన ప్రాజెక్ట్ నుంచి ఎస్.జే.సూర్యను తప్పించి, ఆయన స్థానే డాలీని దర్శకునిగా ఎంపిక చేసిన పవన్ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పు పడుతున్నారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, డాలీతో చేయబోయే ఈ ప్రాజెక్టును రద్దుచేసి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంటనే సినిమా చేస్తే బాగుంటుందని హార్డ్ కోర్ ఫ్యాన్స్ భావిస్తున్నారట. అయితే.. పవన్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా లేడు. శరత్ మరార్ ప్రొడ్యూసర్ గా డాలీతో సినిమా చేయాలనే ఫిక్స్ అయ్యాడు.

కాగా.. ఎస్.జే.సూర్యతో తాను తలపెట్టిన ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇదివరకే మొదలైన సంగతి తెలిసిందే. ఈ స్థితిలో వాటిని ఆపేసి, త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలన్న ఆలోచన మంచిదికాదన్న ధోరణిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో, దానికి పవన్ ఎలా సర్దిచెబుతారో చూడాలి.

ఇది కూడా చూడండి: హెచ్‌ఐవి లక్షణాలు

ఇది కూడా చూడండి: తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ లో అపరిచితులతో చాటింగ్ చేస్తున్నారా..పారాహుషార్

English summary

Pawan Fans says It Is Better To Do Film With Trivikram Srinivas . But pawan kalyan to do film with dolly.