హీరోయిన్‌ కోసం పవన్ గొడవ

Pawan Fights With Producer For Heroine

12:01 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Pawan Fights With Producer For Heroine

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శరత్‌ మరార్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రాయ్‌లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేంటంటే 'సర్దార్‌' చిత్రం పవన్‌ సరసన ముందు అనీషా అంబ్రోస్‌ ని హీరోయిన్‌ గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత అనీషా ని తప్పించి కాజల్‌ అగర్వాల్‌ ని తీసుకున్న సంగతి తెలిసిందే. అసలు అనీషా అంబ్రోస్‌ ని తప్పించడానికి గల కారణం ఈ చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ యేనట. సర్దార్‌ షూటింగ్‌ ప్రారంభమయ్యాక పవన్‌-అనీషా మధ్య కెమిస్ట్రీ బాగోలేదని శరత్‌ మరార్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని శరత్‌ మరార్‌ పవన్‌ దగ్గర చెప్తే ఒక అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్న తరువాత ఆమెను తీసేయడం మంచి పద్దతి కాదని పవన్‌ వాదించారట. కానీ నిర్మాత శరత్‌ మరార్‌ ససేమిరా అనడంతో అనీషా స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ని తీసుకున్నారట. ఇప్పుడు పవన్‌-కాజల్‌ మధ్య కెమిస్ట్రీ బాగుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా శరత్‌ మరార్‌ ఇలా ఒక అమ్మాయిని తీసుకుని మళ్ళీ తప్పించడం కరెక్ట్‌ కాదని కొందరు అంటుంటే, తాను పెట్టిన డబ్బు తిరిగి రావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడని మరి కొందరు అంటున్నారు.

English summary

Power Satr Pawan Kalyan's upcoming film was Sardar Gabbar Singh.This movie was directing by power fame Bobby and Sharrath Marar was the producer for this film.At first Anisha Ambrose was selected as heroine for this movie but she was replaced by Kajal Agarwal.Sharrath Marar does not impressed Anisha Ambrose chemistry with Pawan Kalyan and thats the reason behind She was replaced by Kajal Agarwal.