పవన్‌ ను కంటతడి పెట్టించిన 'నాన్నకు ప్రేమతో'

Pawan get emotional by watching Nannaku Prematho

11:18 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Pawan get emotional by watching Nannaku Prematho

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాతో బిజీగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఎన్‌టీఆర్ సంక్రాంతి కానుకగా విడుదల చేసిన సినిమా 'నాన్నకు ప్రేమతో'. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అందరూ ఈ సినిమాను చూసి ఎన్‌టీఆర్ ని, సుకుమార్‌ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్‌లో పవన్‌ కూడా చేరాడు. తాజా సమాచారం ప్రకారం పవన్‌ నాన్నకు ప్రేమతో సినిమా స్పెషల్‌ షో చూసాడనీ, క్లైమ్యాక్స్ చూసేటప్పుడు కంటతడి పెట్టుకున్నాడని సమాచారం. తారక్‌, రాజేంద్రప్రసాద్‌ మధ్య ఉన్న ఎమోషనల్‌ సీన్స్‌ చూసినప్పుడు ఆయన తండ్రి తో గడిపిన రోజులు పవన్‌కి గుర్తొచ్చాయట.

ఇలాంటి అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు పవన్‌, సుకుమార్‌ ని ప్రశంసించాడని సమాచారం. ఈ సినిమాలో ఎన్‌టీఆర్-రాజేంద్రప్రసాద్‌ ల నటన పవన్‌ కు బాగా నచ్చిందట.

English summary

Pawan get emotional by watching Nannaku Prematho climax scene. He get emotional after watching sentiment scenes in Nannaku Prematho movie.