నాన్నకు ప్రేమతో హిట్‌ కి కారణం పవన్

Pawan is the reason behind Nannaku Prematho success

12:29 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Pawan is the reason behind Nannaku Prematho success

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా బ్లాక్‌ బస్టర్‌ 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులోనే కాదు ఓవర్‌సీస్‌లో కూడా సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో బాహుబలి, శ్రీమంతుడు చిత్రం తరువాత టాప్‌ మూడో చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విజయానికి ఎన్టీఆర్‌ నటన, సుకుమార్‌ దర్శకత్వమే కాదు మరో కారణం కూడా ఉంది. అతనే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. అవును ఇది అక్షరాలా నిజం. పవన్‌కి నాన్నకు ప్రేమతో నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించి 2 కోట్లు పారితోషికం ఇవ్వాల్సిన విషయం తెలిసిందే.

అందుకోసం పవన్‌ నిర్మాత పై ఫిలిం ఛాంబర్‌ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్‌ నాన్నకు ప్రేమతో చిత్రానికి అడ్డు పడుతున్నాడని తప్పుగా అనుకున్నారంతా. కానీ పవన్‌ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడే కానీ బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ని డబ్బు కోసం మళ్లీ ఇబ్బంది పెట్టలేదు. అందుకే నాన్నకు ప్రేమతో చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తయింది. 'నాన్నకు ప్రేమతో' పూర్తి అవ్వడం కోసమే పవన్‌ ఆ డబ్బులు గురించి బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ని ఇబ్బంది పెట్టలేదు. చివరికి నాన్నకు ప్రేమతో విడుదలై సూపర్‌హిట్‌ అయినా పవన్‌కి 1.5 కోట్లు ఇచ్చి సరిపెట్టేశాడు ప్రసాద్‌.

Michi Vilas Poll

మీ ఫేవరెట్ హీరో ఎవరు?

English summary

Power Star Pawan Kalyan is the reason behind Young Tiger Ntr Nannaku Prematho success. Sukumar is directed this movie.