కుటుంబ బంధాన్ని - రాజకీయాలను వేరు చేసిన పవన్

Pawan Kalyan About Chiranjeevi In Sardaar Audio Function

12:43 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan About Chiranjeevi In Sardaar Audio Function

తమ్ముడు తమ్ముడే పేకాట, పేకాటే... ఎక్కడైనా బావ గానీ వంగ తోట కాడ కాదు ... ఇలా మన కు సామెతలు ఉండనే వున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ బంధానికి , రాజకీయాలకు క్లారిటీ ఇచ్చాడు. అది వేరు ఇది వేరు అని చెప్పేసాడు. పవన్ హీరోగా నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో అభిమానుల కేరింతల మధ్య సందడిగా సాగాయి. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేయడం అభిమానులకు మరీ ఆనందాన్ని ఇచ్చింది. ఓ పక్క అన్నయను దేవుడు, తండ్రి అంతటి తర్వాత తండ్రి లాంటి వాడు అంటూ అభిమానం కురిపిస్తూనే, రాజకీయాలు మాత్రం నా ఇష్టం' అంటూ క్లారిటీ గా చెప్పాడు.

సాధారణ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు ...

''నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని పది మంది ముందూ చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. కాని ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి నేను వెనకడుగు వేయను'' అంటూ తన అన్నయ్య పై ఎంత అభిమానం ఉందో పవన్ చాటి చెప్పాడు. ''నేను చదువుకోకుండా.. ఇంట్లో తిని తిరుగుతుంటే.. అన్నయ్య మాత్రం ఎండల్లో కష్టపడుతూ.. తనకు సరిపోని షూస్ వేసుకొని.. కాళ్ళు వాసిపోయి.. ఇంటికి వచ్చిన ఆయన షూస్ తీసుకోలేక చతికిలపడితే.. ఆ కాలికి వున్న బూట్లు తీసి , సాక్స్ తీసేవాడిని. చెమట పట్టిన ఆయన సాక్స్ తీస్తుంటే, అన్నయ్య కష్టం తాలూకు ... ఆ చెమట వాసన నాకు సువాసనలా ఉండేది. ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఎవరి అండా దండా లేకున్నా స్వశక్తితో ఎదిగాడు. మెగాస్టార్ అయ్యాడు' అని పవన్ వివరిస్తుంటే, అన్నయ్య కళ్ళు చెమర్చాయి. ఆ వేడుకలో చాలామంది ఆసక్తిగా వింటూ, అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదేరా అనుకున్నారు.

ఆమె నాతో ఒక రాత్రి గడిపితే 6 కోట్లు ఇస్తా

అన్నయ్య మీద రివేంజ్ తీర్చుకోడానికే పిలిచాడా

సర్దార్ వేడుకలో హైలెట్స్ ....

నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

English summary

Power Star Pawan Kalyan's Upcoming Film Sardaar Gabbar Singh movie Audio function was held grandly in Hyderabad at Novotel hotel. Pawan kalyan praised Mega Star Chiranjeevi in this audio function. Pawan says that due to Chiranjeevi he was in this position.