పవన్ చెప్పిన మెగాస్టార్ సాక్సుల కథ

Pawan Kalyan About Chiranjeevi In Sardar Audio Launch

04:03 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan About Chiranjeevi In Sardar Audio Launch

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో వేడుక గత ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్‌ హోటల్‌లో అభిమానుల కేరింతల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హజారయ్యి అభిమానులను అలరించాడు.ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. మొదట్లో అమితాబ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆ తరువాత అన్నయ్య (చిరంజీవి) హీరో అయిన తర్వాత హీరో అంటే అన్నయ్య మాత్రమే . ఈ రోజు తానూ యాక్టర్ ను అయ్యానంటే కారణం అన్నయ్య వదినలే అంటూ చెప్పుకోచ్చాడు . నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని పది మంది ముందూ చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. కాని ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి నేను వెనకడుగు వేయను అంటూ చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

పవన్ కళ్యాణ్ తాను చదువుకోకుండా , ఇంట్లో కూర్చుని తిని తిరుగుతుంటే , చిరంజీవి మాత్రం ఎంతో కష్టపడే వారని , చిరంజీవి తనకు సరిపోని షూస్ సైతం వేసుకోవడం వల్ల కాళ్ళు వాసిపోయేవని, అలా షూటింగ్ నుండి ఎప్పటికో 12 గంటలకో 1 గంటకో వచ్చిన చిరంజీవి అలసిపోయి ఆ షూష్ తోనే పడుకుండిపోయే వాడని అన్నాడు. "చిరంజీవి షూ సాక్సులు సైతం తానే తీసేవాడినని, అలా చెమట పట్టిన సాక్స్ తీస్తుంటే తనకు సువాసన గా అనిపించేదని "చెప్పాడు. సినీ పరిశ్రమలో ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు (చిరంజీవి)ఎవరి అండా దండా లేకున్నా స్వశక్తితో ఎదిగాడని , అయన తరువాత మెగాస్టార్ గా ఎదిగాడని అన్నాడు. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకూడదని తానూ ఎక్కువగా కష్ట పడతానని అన్నాడు. ఇక రాజకీయల గురించి మాట్లాడుతూ రాజకీయాలు వేరు , మా అన్నదమ్ముల బంధం వేరు అని అవి రెండు రెండు వేరు వేరు మార్గాలు అని చిరంజీవి ఎప్పుడు తన గుండెల్లో ఉంటాడని పవన్ అన్నాడు.

పవన్‌కు చెక్క గుర్రంపై మోజెందుకు ?

విచిత్రమైన అంత్యక్రియలు

అమితాబ్ జాతీయగీతం సరిగా పాడలేదట

ఎవరికోసం మహేష్ వెనక్కుతగ్గాడు

English summary

Power Star Pawan Kalyan praised Mega Star Chiranjeevi in Sardar Gabbar Singh Audio Launch.Pawan Kalyan Said that Chiranjeevi was the main reason for his movie career.Chiranjeevi was the man who become Mega Star with no one's support. Pawan Kalyan Also said that he used to take off the shoes and socks of Chiranjeevi in Past and Chiranjeevi Socks Smells like Scent to him.