ఒకే వేదికపైకి రానున్న కేసీఆర్-పవన్

Pawan Kalyan and KCR coming as a chief guests for Jaguar movie

05:24 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan and KCR coming as a chief guests for Jaguar movie

ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తొలిసభ కాకినాడలో పెట్టి చెడామడా ఉతికి ఆరేసాడు. తెలంగాణా అంటే ప్రేమ ఉందని, తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని అన్నాడు. హైకోర్టు విభజన చేయకపోవడాన్ని కూడా పవన్ ప్రస్తావించగా, ఎంపీ కవిత స్పందించి పవన్ కి మెచ్చుకోలుగా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పొలిటికల్ మీట్ కాదు. ఓ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఇలా వీళ్ళిద్దరూ కలుసుకోవచ్చు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు సినీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్న నిఖిల్ కుమార్ మూవీ 'జాగ్వార్' ఆడియోకి కేసీఆర్, పవన్ కళ్యాణ్ హాజరు కావచ్చునని తెలుస్తోంది. ఈనెల 18న హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరగనుంది. స్పెషల్ గెస్టులుగా వీరిని కుమారస్వామి ఇప్పటికే పిలిచారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేసీఆర్, పవన్, ఒకే వేదికమీద కలుసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇద్దరు దిగ్గజాలు అటెండ్ అయితే ఇక తన తనయుడి మూవీ హిట్ కావడానికి అదే కారణమవుతుందని కుమారస్వామి భావిస్తున్నారట. దాదాపు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న జాగ్వార్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: నేను కట్నం అడగలేదు.. వాళ్ళు ఇవ్వలేదు..

ఇది కూడా చదవండి: గుమ్మానికి మామిడి తోరణం కట్టడం వెనుక అసలు రహస్యం!

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం: హీటర్ ఎక్కువగా వాడుతుందని భార్య బట్టలు ఊడదీసి..

English summary

Pawan Kalyan and KCR coming as a chief guests for Jaguar movie. Pawan Kalyan and Telangana CM KCR coming as a chief guests for Jaguar movie audio launch in Hyderabad.