ఎన్టీఆర్ నిర్మాతకు షాకిచ్చిన పవన్ , త్రివిక్రమ్

Pawan Kalyan And Trivikram Gives Shock To Mythri Movie Makers

03:13 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan And Trivikram Gives Shock To Mythri Movie Makers

సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ ప్రొడక్షన్ సంస్ద ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఈ బ్యానర్ బాగా పాపులర్ అయ్యిపోయింది.

ఇవి కూడా చూడండి:ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ - కాజోల్ !

అయితే మైత్రీ మూవీస్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమాను ప్లాన్ చేసారు , ఆ సినిమాకు అడ్వాన్స్ లు కుడా ఇచ్చారని సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాకు తీసుకున్నఅడ్వాన్స్ సొమ్మును వెనక్కి ఇచ్చేసారట.

ఇవి కూడా చూడండి:భారత్ లో వాట్సప్ బ్యాన్ !?

ఇది ఇలా ఉంటె ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వూలలో తన తరువాతి సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు నితిన్ తో అ..ఆ చేస్తున్న నిర్మాత చేతికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చూడండి:షాకింగ్: ఐష్ ని ముద్దాడిన జర్నలిస్ట్

ఇది వరకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి . త్రివిక్రమ్ , పవన్ కళ్యాణ్ లకు మంచి బయట స్నేహితులన్న విషయం తెలిసిందే . వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై ఓ రేంజిలో హైప్ క్రియేట్ అవడం ఖాయం. మరి ఏ ప్రొడ్యూసర్ ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చూడండి:

కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

ప్రపంచంలో అతి కష్టమైన పని ఇదేనట

English summary

Power Star Pawan Kalyan and Director Trivikram were good friends in the film industry. Previously Mythri Movie Makers Gave Advance to Trivikram and Pawan Kalyan for doing movie in their banner but both of them returned money back to the producers.