సినిమాలు మానేస్తానని చెప్పిన పవన్‌ ఇంటర్‌వ్యూ(వీడియో)

Pawan Kalyan-Anupama Chopra interview video

02:37 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan-Anupama Chopra interview video

'పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌', ఈ పేరు వింటేనే అభిమానుల్లో ఒక వైబ్రేషన్‌ మొదలౌతుంది. అతి తక్కువ సినిమాలతోనే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా ఎదిగిన నటుడు పవన్‌. అభిమానుల గుండెల్లో పవన్‌ ఒక ఆరాధ్య దేవుడు, కనిపించే దైవం, ఒక అండ, ఒక ధైర్యం, ఒక ఆశ, ఒక వ్యసనం ఇంకా చెప్పాలంటే పవన్‌ వాళ్ల కోసం పుట్టిన మనిషి. సౌత్‌ ఇండియాలో రజనీకాంత్‌ తరువాత మళ్లీ అంత అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు పవన్‌. తన నటనకంటే వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవన్‌ ప్రజల కష్టాల్ని తీర్చడం కోసం 2014లో 'జనసేన' అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

పవన్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రం సెట్స్‌ పై ఉండగా ప్రముఖ జర్నలిస్ట్‌ అనుపమ చోప్రా పవన్‌ని ఇంటర్‌వ్యూ చేశారు. దీనిలో భాగంగా పవన్‌ సినీ జీవితం గురించి చెప్పారు. తాను అనుకోకుండా సినిమా హీరోని అయ్యానని, నేను మంచి నటుడ్ని కానని, నాకు ఆ అర్హత లేదని పవన్‌ చెప్పారు. అంతేకాదు పవన్‌ ఇంక రెండు, మూడు చిత్రాల తరువాత సినిమా లు చెయ్యనని ఆ తరువాత పూర్తి రాజకీయాలకే నా జీవితం అంకితమిస్తానని చెప్పారు. అంతే కాదు తాను సినిమాలు ఎప్పుడు మానేయబోతున్నారో కూడా డేట్‌ని చెప్పారు. ఈ ఇంటర్‌వ్యూ వీడియోలని మూడు భాగాలుగా అనుపమ చోప్రా విడుదల చేశారు.

ఈ వీడియోలని చూసిన వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ పవన్‌కళ్యాణ్‌ పై పాజీటీవ్‌ గా స్పందించాడు. ఈ ఇంటర్‌వ్యూ ఇప్పుడే చూశా, చాలా బాగుంది. ఇందులో పవన్‌ ఎంతో ఎడ్యుకేటడ్‌గా మాట్లాడారు అని వర్మ ప్రశంసలు కురిపించాడు.

1/5 Pages

పవన్-అనుపమ ఇంటర్‌వ్యూ పార్ట్: 1

English summary

Power Star Pawan Kalyan- Ndtv journalist Anupama Chopra interview video. Pawan Kalyan told about his cinema life.