టీవి యాంకర్‌గా 'పవన్‌కళ్యాణ్‌'!!

Pawan Kalyan as a tv anchor

05:44 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan as a tv anchor

సినిమా రంగంలో ఉన్న టాప్‌ స్టార్స్ వెండి తెర పై మాత్రమే కాకుండా బుల్లి తెర పై కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అమీర్‌ఖాన్‌ చేసిన 'సత్యమేవ జయతే' మరియు అమితాబ్‌ చేసిన కరోడ్‌పతి టీవి షోలు భారీ హిట్లు సాధించాయి. ఇంక మన తెలుగులో అక్కినేని నాగార్జున చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కూడా చాలా విజయవంతంగా కొనసాగుతుంది. అయతే ఈ లిస్ట్‌లో పవన్‌కళ్యాణ్‌ కూడా చేరనున్నాడు అని సమాచారం. రామోజీరావు నేతృత్వంలో సామాజిక దృక్పదం కలిగిన ఒక టి.వి షోను 'ఈ టీవి' ప్రారంభించబోతుంది. ఈ షోకి పవన్‌ యాంకరింగ్‌ చేయాలని రామోజీరావు పవన్ ని కోరారని, అందుకు పవన్‌ కల్యాణ్ కూడా ఒప్పకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి పవన్‌కు రామోజీరావుకు సంబంధాలు ఉన్నాయని కారణంగానే యాంకరింగ్‌ చేసేందుకు పవన్‌ అంగీకరించాడని సమాచారం.

English summary

Pawan Kalyan is doing as a tv anchor for ETV channel by requesting of Ramoji Rao. The program is for social awareness.