నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు

Pawan Kalyan At A Aa Audio Launch

10:21 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan At A Aa Audio Launch

హీరో నితిన్ తన తమ్ముడిలా అనిపించాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. తాను గబ్బర్ సింగ్ సినిమా చేస్తుండగా నితిన్ సెట్ కి వచ్చాడని, ప్రేమగా, ఆప్యాయతగా దగ్గరకు వచ్చి విష్ చేయగానే నా తమ్ముడిలా భావించానని చెప్పాడు. నితిన్ తాజా సినిమా 'అ..ఆ'. మూవీ ఆడియో ఈవెంట్ కు చీఫ్ గెస్టు గా హాజరైన పవన్..ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. తొలి సీడీ ని రిలీజ్ చేసిన పవన్.. హీరో రచయిత రాసిన డైలాగుల్ని చెప్పేవాడే గానీ రాసేవాడు కాదన్నాడు. అందుకే రచయిత పాత్రే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. త్రివిక్రమ్కి,తనకు మధ్య ఉన్న స్నేహాన్ని పవన్ వివరించాడు. త్రివిక్రమ్ లాంటి గొప్ప రచయిత టాలీవుడ్ కే గర్వ కారణమని పవన్ కళ్యాణ్ ప్రశంసించాడు.ఇక త్రివిక్రమ్ కూడా తనకు, పవన్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ సమంత, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ ప్రభ్రుతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:‘బ్రహ్మోత్సవం’ టీజర్‌కి ‘కబాలి’ షాక్?

ఇవి కూడా చదవండి:చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

ఇవి కూడా చదవండి:పవన్ సేనాపతి ఫస్ట్ లుక్ సందడి!

English summary

Young Hero Nithin's recent movie was A Aa and this movie was directed by Director Trivikram Srinivas. Yesterday This A Aa Movie audio was released by Power Star Pawan Kalyan at Hyderabad. Pawan Kalyan said that Nithin was like his brother. He also praised Director Trivikram Srinivas .