అసిస్టెంట్ డైరెక్టర్ పై చెయ్యి చేసుకున్న పవన్ !!

Pawan Kalyan Beats Assistant Director

12:59 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Beats Assistant Director

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ఒక తెరిచినా పుస్తకం లాంటి వాడినని పలు సందర్భాలలో చెప్పడం మనం చూసాం. ఈపుడు వివాదాలకు , విమర్శలకు దురంగా ఉండే పవన్ కళ్యాణ్ పై తాజాగా ఒక గాసిప్ పుట్టుకొచ్చింది , అదేంటంటే.., పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పలువురు సినీ ప్రముఖులు సైతం సర్దార్ సెట్లో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి సైతం సర్దార్ సెట్లో ప్రత్యక్షమయ్యి అందరిని ఆశ్చర్యపరిచాడు . ఒక వార్త ప్రకారం మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవన్ కళ్యాణ్ లు ఎంతటి మంచి మిత్రులో వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఇద్దరు పలు సందర్బాలలో చెప్పడము మనం చూసాం. అయితే ఒక రోజు త్రివిక్రమ్ సర్దార్ సెట్ కు వచ్చాడట, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోవడంతో , అక్కడున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని కూర్చో పెట్టి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని ఒక ఫూటేజ్ లోని కొంత భాగాన్ని త్రివిక్రమ్ కి చూపించాడట.

ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పై చెయ్యి చేసుకుని .. అసలు సినిమాలోని ఫూటేజ్ నూ ఎవరు చుపించామన్నారు అంటూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పై కోపడ్డాదట . వెంటనే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నూ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం టీంలో నుండి తీసేసారట. ఈ ఘటన పై సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర యూనిట్ సైతం స్పందించడం లేదని సమాచారం. మైకు పట్టుకుని ఎప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ .. ఇలా చెయ్యడం ఏంటని పలువురు పెదవి విరుస్తుంటే....మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ పవన్ కు ఎంతటి ఆప్త మిత్రుడైనా సినిమా విషయంలో కాదని , పవన్ కళ్యాణ్ కు సినిమా పై ఉన్న కమిట్మెంట ఏంటో ఈ ఘటన నిరూపించిందని , అసలు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాను వేరే వాళ్లకు చూపించడం ఏంటని పవన్ ఫాన్స్ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పై మండి పడుతున్నారు . ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన " అత్తారింటికి దారేది " సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

English summary

Power Star Pawan Kalyan's upcoming movie was Sardar Gabbar Singh.This movie was directing by Director Babi.Kajal Agarwal,Sanjjana,Rai Lakshmi we acting as heroines in Sardar Gabbar Singh Film.A Recent gossip came to know that Trivikram Srinivas visited Sardar set and one of the assistant director show some footage of Sardar Movie.Due to that Pawan Fired on that Assistant Director.