సభకోసం జనసేన నేత కాకినాడ వచ్చేసాడు(వీడియో)

Pawan Kalyan came to Kakinada for special status sabha

07:07 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan came to Kakinada for special status sabha

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తో కాకినాడ జెఎన్టియు గ్రౌండ్ లో 9వ తేదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఆత్మగౌరవ సభకు ఒక రోజు ముందుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేరుకున్నాడు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక కాన్వాయ్ లో కాకినాడకు బయలుదేరి వెళ్ళారు. అయితే కాకినాడలో పవన్ బస చేసే ప్రాంతాన్ని కాస్తంత కాన్ఫడెన్సియల్ గా నిర్వహకులు వుంచారు. అయితే సర్పవరం భావన్నారాయణ స్వామి ఆలయం దర్శించి, ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన పవన్ మీడియాతో మాత్రం మాట్లాడలేదు.

కాకినాడలో జరిగే ప్రత్యేకహోదా సభకు ఇప్పటికే నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర మంత్రి జెట్లీ ప్రకటించడం, దానిని చంద్రబాబు స్వాగతిస్తామని చెప్పడం వంటి పరిణామాల నేపథ్యంలో జనసేన నేత ఎలా స్పందిస్తాడో చూడాలి. పైగా తూర్పు గోదావరి జిల్లా నుంచే సెంటిమెంట్ గా హోదాకోసం సభకు శ్రీకారం చుట్టడంతో అందరి దృష్టి పవన్ వైపే వుంది.

ఇది కూడా చదవండి: డబ్బు కోసమే రాధికా ఆప్టే న్యూడ్ వీడియో లీక్ చేసారా?

ఇది కూడా చదవండి: ప్రపంచంలో టాప్ 10 అందగత్తెలు వీరే!

ఇది కూడా చదవండి: 'ఇంకొక్కడు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Pawan Kalyan came to Kakinada for special status sabha