పవన్ ఎస్.జె. సూర్యను తీసేసి డాలీని ఎందుకు పెట్టుకున్నట్టు?

Pawan Kalyan changed his director

11:50 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan changed his director

ఓ డైరెక్టర్ ని అర్ధాంతరంగా తీసేసి మరొకరిని పెట్టుకోవడం వెనుక ఏమైనా మిస్టరీ ఉందా? అని టాలీవుడ్ లో టాక్. ఇంతకీ ఎవరి గురించి అంటే, పవర్ స్టార్ గురించి వివరాల్లోకి వెళ్తే.. సర్దార్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.జె. సూర్యను మార్చేశాడు. అతని స్థానంలో డాలీని దర్శకునిగా సెలెక్ట్ చేసుకుని అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. నటుడిగా ఎస్.జె. సూర్య బిజీగా ఉండడం వలన అతని స్థానంలో డాలీని పవన్ తీసుకున్నాడు. తమిళ మూవీ ఇరైవి లో ఎస్.జే. సూర్య నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని అవకాశాలు వస్తున్న దృష్ట్యా ఎక్కువ సమయం పవన్ మూవీకి పని చేయలేకపోతున్నాడు.

తెలుగులో మహేష్ బాబు సరసన ఏఆర్ మురుగదాస్ తీస్తున్న సినిమాలో సూర్య విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఈ కారణంతోనూ పవన్ థాట్ మారిపోయింది. తన తాజా సినిమా డిలే అవుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతేకాదు.. పైగా.. గోపాల గోపాల మూవీ దర్శకుడు డాలీతో మనం కలిసి మరో ప్రాజెక్ట్ చేద్దామని పవన్ మాటిచ్చాడని, ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఈ ఆఫర్ ఇచ్చాడని కూడా టాక్ నడుస్తోంది. ఏమైనా ఇన్నాళ్ళూ ఎస్.జె సూర్యతో పవన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ అని వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. మరి ఏరికోరి సెలెక్ట్ చేసుకున్న డాలీ, పవన్ నమ్మకాన్ని ఏమేరకు నిలబెడతాడో చూడాలి.

English summary

Pawan Kalyan changed his director