పాత నోట్లని బ్యాంకుకి వెళ్లి మార్చుకున్న పవన్.. ఎంతో తెలుసా(వీడియో)

Pawan Kalyan changed his old currency in bank

06:18 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan changed his old currency in bank

ఎవరినీ వదలని సమస్యగా నోట్ల రద్దు యవ్వారం నడుస్తోంది. అందుకే పెద్ద నోట్ల రద్దు ప్రకటన సామాన్యులనే కాదు సెలబ్రిటీలను సైతం ఇబ్బందులకు గురి చేస్తోంది. దాదాపు వారం రోజులుగా ఎంతోమంది భారతీయుల కాలం బ్యాంకుల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఓ బ్యాంకుకు వచ్చి తన వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకున్నాడు. పవన్ స్వయంగా బ్యాంకుకు వచ్చి తన వద్దనున్న పెద్ద నోట్లను బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. పవన్ బ్యాంకులో కూర్చుని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

పవన్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. పవన్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అక్కడ మరింత గందరగోళం సృష్టించడం ఇష్టం లేక పవన్ తన పనిని త్వరగా ముగించుకుని వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.

English summary

Pawan Kalyan changed his old currency in bank. Pawan Kalyan goes to bank and changed his currency in Hyderabad.