పవన్ గురించి చిన్ననాటి ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసా?

Pawan Kalyan childhood friend shocking facts about Pawan

11:55 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan childhood friend shocking facts about Pawan

ఇటు సినీ రంగంలో దూసుకుపోతూ మరోవైపు జనసేన నేతగా రాజకీయాల్లో కూడా భాగం కలిగి ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద ప్రతి అభిమానికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ లైఫ్ లు వారి వారి వ్యక్తిగతం. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని శ్రీ శ్రీ అన్నట్టు పవన్ రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి మరి ఎక్కువైంది. ఇలాంటి నేపధ్యంలో పవన్ చిన్ననాటి స్నేహితుడు అండ్ ట్యూషన్ మేట్ అయిన గుణరంజన్ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పవర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేసాడు. 1987వ సంవత్సరం ప్రాంతంలో పవన్ తన స్నేహితుడు గుణరంజన్ తో కలిసి నెల్లూర్ లో వినయ్ బాబు అనే లెక్కల మాస్టర్ దగ్గరకు ట్యూషన్ కి వెళ్ళేవారట.

అలాగే కాలేజ్ లో కూడా గుణరంజన్ తో పాటు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా పవన్ కూర్చునే వాడట. ఇంటర్ లో 8 గ్రేస్ మార్కులతో పాస్ కావటంతో పవన్ గుణరంజన్ తో నేను చదువుకు పనికిరానని అనేవాడట. అప్పుడు అన్నయ్య వలే సినిమాల్లో నటించవచ్చు కదా అని అడిగా. నా మీద జోక్స్ వేస్తున్నావా అనేవాడు. కాకపోతే అప్పట్లోనే ఏదో ఒకటి చేయాలనే కాంక్ష చాలా ఎక్కువగా ఉండేది అని గుణరంజన్ చెప్పుకొచ్చాడు. తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో మా అందరికి పవన్ డ్రింక్స్ కొని ఇచ్చేవాడు. చాలా బిడియంగా ఉండే పవన్ ఇంతటి స్టార్ అవుతాడని, రాజకీయ పార్టీ స్థాపిస్తాడని కానీ ఊహించలేదు అని పవన్ చిన్ననాటి స్నేహితుడు గుణరంజన్ చెబుతూ, పవన్ వంటి వ్యక్తులు రాజకీయాలకు చాలా అవసరమని అన్నాడు.

English summary

Pawan Kalyan childhood friend shocking facts about Pawan