లడ్డూ పాట .. ఇరకాటంలో పవన్

Pawan Kalyan Clarity On Laddu Issue

11:11 AM ON 27th January, 2017 By Mirchi Vilas

Pawan Kalyan Clarity On Laddu Issue

ప్రత్యేక హోదా పేరుతొ యువతను పోరాటానికి పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేశ్ బచావో పేరుతో ఓ పాటల ఆల్బమ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాలోని కొన్ని పాటలను, బహిరంగ సభల్లోని కొన్ని డైలాగ్స్ ను మిక్స్ చేసి డీజే పృథ్వీ దేశ్ బచావో ఆల్బమ్ ను రూపొందించారు. ఈ పాటల్లోని ఓ పాటలో పవన్ లడ్డూ అంటూ చెప్పే డైలాగ్ పదేపదే వినిపిస్తోంది. ఈ పాటపై అప్పుడే వివాదం రాజుకుంది. పవన్ ప్రతీ సందర్భంలో పాచిపోయిన లడ్డూలని అంటున్నారని, పాటలో కూడా లడ్డూ అంటూ అవమానపరిచే విధంగా ఉందని కొందరు పవన్ పై మండిపడ్డారు.

ఈ విషయం ఆనోటా ఈనోటా వెళ్లి చివరకు పవన్ చెవిన పడింది. దీంతో పవన్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఈ విషయంపై పవన్ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. తనకు లడ్డూల మీద కాని, అవి అమ్మే వ్యాపారుల మీద కాని, వాటిని తినే వారి మీద కాని ఎలాంటి చులకన భావం లేదని జనసేన మనవి చేసుకుంటుందని పవన్ ట్వీట్ చేశారు. కానీ అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదే మాకున్న అసహనమంతా అని గుర్తించాలని పవన్ తెలిపాడు. అంతేకాదు, లడ్డు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు అంటూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. మొత్తానికి ఈ వివాదం సద్దుమణిగింది.

English summary

Power Star Pawan Kalyan was said that Special status was like stale laddu and he yesterday said that he just comapred that but not he was saying to not to eat laddu. He also said that eating of laddu was not injurious to health.